TS Inter Results 2026 Supplementary Dates

ఇంటర్ ఫలితాలు విడుదలై బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించగా, ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. TS Inter Results 2026 announced with girls outperforming boys; advanced supplementary exam schedule released for failed students.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో బాలికలు స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు.
ప్రథమ సంవత్సరంలో మొత్తం 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 74.40 శాతం, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 78.65 శాతం, బాలురు 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అధికారులు మాట్లాడుతూ, ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. మంచి పాస్ శాతం నమోదు కావడం సంతోషకరమని తెలిపారు. ఒక నెలలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, అందులో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో రెగ్యులర్‌గా ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.
బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో పాస్ శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల హాజరు పెరగడానికి ఈ చర్యలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 13 నుంచి 20 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇదే సమయంలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. మే 13 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
The Telangana Intermediate first and second year results have been officially announced, with girls outperforming boys across both years. Government Advisor K. Keshava Rao and Education Secretary Yogita Rana released the results at 11 AM.
In the first year, the overall pass percentage stood at 66.20%, with girls achieving 74.40% and boys 57.69%. In the second year, the overall pass percentage reached 70.58%, with girls at 78.65% and boys at 62.50%.
Officials congratulated successful students and noted that the pass percentage has improved. They confirmed that advanced supplementary exams will be conducted within a month, allowing students who pass to continue into degree courses as regular students.
Authorities also highlighted a rise in pass percentages in BC Welfare colleges. New initiatives such as mid-day meals and breakfast programs are being introduced to improve attendance and student performance.
According to the schedule, re-counting and re-verification applications can be submitted from April 13 to April 20. Supplementary exam fee payment is also open during this period. The advanced supplementary exams will begin on May 13, while practical exams are scheduled from May 22 in two sessions.