చంకలో నలుపు పోవాలంటే ఇలా చేయండి…

Best Natural Remedies for Underarms

చంకల్లో నలుపు, చెమట వాసన సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Many people are facing underarm darkness and sweat odor issues, and experts suggest that simple natural remedies available at home can help reduce these problems effectively.

ప్రస్తుతం అండర్ ఆర్మ్స్ నలుపు సమస్య ముఖ్యంగా యువతిలో ఎక్కువగా కనిపిస్తోంది. శుభ్రత పాటించినా, హార్మోనల్ మార్పులు, చెమట, డెడ్ స్కిన్ పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అయితే మార్కెట్‌లో లభించే క్రీములకంటే సహజమైన పద్ధతులు మెరుగైన ఫలితాలను ఇస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పటిక (అలమ్) ఉపయోగించడం ద్వారా చెమట వాసనను తగ్గించుకోవచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి చెమటకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. స్నానం తర్వాత తడిగా ఉన్న పటికను చంకల్లో రుద్దడం వల్ల చెమట నియంత్రణలోకి వస్తుంది.

అలాగే పటిక పొడి మరియు రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌గా తయారు చేసి వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. కలబంద (అలోవెరా) గుజ్జుతో కలిపి అప్లై చేస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

నిమ్మరసం, పసుపు మిశ్రమం కూడా చర్మానికి సహజ బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్న వారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం. అదే విధంగా బంగాళదుంప రసం చర్మంపై ఉన్న నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఎంజైమ్స్ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి.

శనగపిండి, పెరుగు, పసుపు కలిపిన ప్యాక్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. పెరుగు లోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

నిపుణుల సూచన ప్రకారం, ఈ నేచురల్ చిట్కాలను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం. అలాగే చెమట వాసన, నలుపు నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది. క్రమం తప్పకుండా స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం వంటి అలవాట్లు పాటించాలి.

Underarm darkness is increasingly common, especially among young women, due to factors like sweat, dead skin buildup, and hormonal changes. Even with good hygiene, this issue persists and affects confidence.

Experts say natural remedies can be more effective than chemical creams. Alum (fitkari) helps control sweat and odor due to its antibacterial properties. Applying it after a bath can reduce bacterial growth.

A paste made with alum powder and rose water can improve skin texture when used regularly. Aloe vera helps reduce pigmentation due to its antioxidant properties.

Lemon juice and turmeric act as natural bleaching agents, though patch testing is recommended for sensitive skin. Potato juice is also effective due to natural enzymes that lighten skin tone.

A mixture of gram flour, curd, and turmeric works as a natural cleanser, removing dead skin and improving brightness. Lactic acid in curd helps soften the skin.

Experts emphasize maintaining hygiene and consistency in using these remedies. Regular bathing and wearing clean, breathable clothes play a key role in preventing underarm issues.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *