Lucknow Beats Hyderabad in Uppal Thriller

ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కెప్టెన్ రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు.
In an IPL match at Uppal, Lucknow Super Giants defeated Sunrisers Hyderabad by 5 wickets, with captain Rishabh Pant playing a match-winning knock.
మొదట బ్యాటింగ్ చేసిన Sunrisers Hyderabad నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 62, నితీశ్ కుమార్ రెడ్డి 56 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Batting first, Sunrisers Hyderabad scored 156/9 in 20 overs. Heinrich Klaasen (62) and Nitish Kumar Reddy (56) led the scoring, while Mohammed Shami, Avesh Khan, and Prince Yadav picked up key wickets.
158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన Lucknow Super Giants 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ 68 నాటౌట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐడెన్ మార్‌క్రం 45 పరుగులతో సహకరించాడు.
Chasing 158, Lucknow Super Giants reached the target in 19.5 overs, losing 5 wickets. Rishabh Pant remained unbeaten on 68, while Aiden Markram contributed 45 runs.
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముందుగా బౌలింగ్ చేసినప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించడంలో బౌలర్ల పాత్ర కీలకమని అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడి ప్రదర్శనను విశ్లేషిస్తున్నామని తెలిపాడు.
After the match, Rishabh Pant praised the bowlers, stating that their effort helped control the game early. He added that the team is closely analyzing each player’s performance.
తన బ్యాటింగ్‌పై వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ పంత్ హాట్ కామెంట్స్ చేశాడు. “నేను మాట్లాడాలనుకోవడం లేదు. నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను. నేను ఎంత కష్టపడుతున్నానో నా సహచరులు, యాజమాన్యానికి తెలుసు” అని చెప్పాడు.
Responding to questions about his batting, Rishabh Pant made strong remarks, saying he prefers to answer with his bat and believes his effort is known to his teammates and management.