Telugu News Headline
క్రెడిట్ కార్డు కొత్త నియమాలు
English News Headline
New Credit Card Rules from April 1: PAN Linking Mandatory, Transactions Under IT Radar

Full Telugu News Article
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు వినియోగంపై కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ మార్పులను గమనించాల్సిన అవసరం ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి అవుతుంది. దీంతో వినియోగదారులు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ వివరాలు ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి వస్తాయి. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైబడిన లేదా అనుమానాస్పద లావాదేవీలను మాత్రమే పరిశీలిస్తుండగా, ఇకపై అన్ని లావాదేవీలు నిఘాలో ఉంటాయి.
పాన్ కార్డు లేకుండా కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం కూడా ఇకపై సాధ్యం కాదు. అలాగే కార్యాలయాల ద్వారా ఇచ్చే క్రెడిట్ కార్డులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగిస్తే, ఆ ఖర్చులు పన్ను పరిధిలోకి వస్తాయి.
అదేవిధంగా, ఉద్యోగులకు ఇచ్చే ఫారం-16 స్థానంలో కొత్త ఫారం 130 ప్రవేశపెడుతున్నారు. ఇందులో జీతం, టిడిఎస్, పెట్టుబడులు, పన్ను వివరాలు ఒకే ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇంకా ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే పదాల స్థానంలో “ట్యాక్స్ ఇయర్” అనే పదాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగ్ జులైలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ మార్పుల నేపథ్యంలో తెలంగాణలో క్రెడిట్ కార్డు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదాయానికి సరిపడని ఖర్చులు చేస్తే పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
Full English News Article
New income tax-related rules governing credit card usage will come into effect across India from April 1. Credit card users in Telangana are advised to take note of these changes to avoid compliance issues.
As per the new regulations, linking a credit card with a PAN card will become mandatory. This move will allow the Income Tax Department to monitor all transactions made by users. Until now, only high-value or suspicious transactions above ₹10 lakh were closely tracked, but under the new system, broader monitoring is expected.
Issuance of new credit cards without PAN details will no longer be permitted. Additionally, if office-issued credit cards are used for personal expenses, such transactions may be treated as taxable income.
In another major change, Form 16 will be replaced by a new consolidated Form 130. This updated format will include salary details, TDS, investments, and tax liabilities in a single document.
The government is also simplifying terminology by replacing “Financial Year” and “Assessment Year” with a single term, “Tax Year.” For the financial year 2025–26, income tax return filing is expected to be completed by July.
With increased scrutiny from the Income Tax Department, users in Telangana are advised to track their spending carefully. Any mismatch between income and expenditure could trigger notices from tax authorities.