లక్ష్మాపూర్ శ్రీరాములగుట్టలో బ్రహ్మోత్సవాలు ఘనంగా…

Brahmotsavam Celebrations at Sriramulagutta Attract Devotees

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ శ్రీరాములగుట్టలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
As part of Brahmotsavam celebrations at Sriramulagutta in Laxmapur under Mudu Chintalapalli Municipality, several religious rituals were conducted on Saturday with a large turnout of devotees.

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలోని శ్రీరాములగుట్టలో బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు నాగరాజు, సందీప్ శర్మ, ఆదిత్య శర్మ మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా సాగాయి.

ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లగిశెట్టి మాధవి, రాంప్రసాద్ దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కటికెల శ్రీవాణి వైద్యనాధ్, చిన్నలచ్చ సరిత శ్రీనివాస్ గౌడ్, చిత్తయ్య గౌడ్, మాడబోయిన సత్యనారాయణ, సింగం పవన్ కుమార్, తోట పరమేష్, కటికెల శ్యామల తదితరులు హాజరయ్యారు. అలాగే స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

In Laxmapur village under Mudu Chintalapalli Municipality, religious rituals including mass Satyanarayana Swamy vratham, Maha Poornahuti, and Kumbhabhishekam were conducted as part of the Brahmotsavam celebrations at Sriramulagutta temple. The rituals were performed traditionally under the chanting of Vedic scholars Nagaraju, Sandeep Sharma, and Aditya Sharma.

A large number of devotees from nearby villages attended the event, offered special prayers, and received teertha prasadam. Annadanam was organized with the support of Lagishetty Madhavi and Ramprasad couple, serving food to devotees.

Local public representatives and temple committee members were present during the event. Katikela Srivani Vaidyanath, Chinnalacha Saritha Srinivas Goud, Chittayya Goud, Madaboyina Satyanarayana, Singam Pavan Kumar, Thota Paramesh, Katikela Shyamala, and other local leaders participated along with villagers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *