సేంద్రీయ వ్యవసాయం తో అధిక దిగుబడులు ….

Organic Farming Benefits Farmers

సేంద్రీయ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు సాధ్యమని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. | Farmers were advised that higher yields are achievable through organic farming practices.

శామీర్‌పేట, మార్చి 17: మూడుచింతలపల్లి రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ రైతులకు సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేంద్రీయ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి, ఎలా వినియోగించాలి అనే అంశాలపై రైతులకు ప్రాయోగికంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జామ్ రవి చేతుల మీదుగా రైతులకు సేంద్రియ వ్యవసాయం క్యాలెండర్లు, డైరీలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఏడీఏ వెంకట్ రాం రెడ్డి, వ్యవసాయ అధికారి ప్రవీణ, కౌన్సిలర్ నీరజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, నాయకులు బండి జగన్నాథం, భూమేష్, నెల్లూట్ల ఆంజనేయులు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

At an awareness program held at the Muduchintalapally Rythu Vedika on Tuesday, District Agriculture Officer Chandrakala explained the benefits of organic farming to farmers. She emphasized that adopting modern techniques along with natural and organic farming methods can help achieve better yields.

Farmers were advised to reduce the use of chemical fertilizers and switch to organic alternatives. Practical guidance was provided on the preparation and usage of organic fertilizers.

On the occasion, organic farming calendars and diaries were distributed to farmers by Medchal Market Committee Chairman Narsimlu Yadav and Muduchintalapally Municipal Chairman Jam Ravi. Several officials, public representatives, and farmers participated in the program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *