కవల పెళ్లి ఇంట్లో విషాదం
English News Headline
Kamareddy Twin Marriage Tragedy: Groom Found Dead in Canal

Full Telugu News Article
కామారెడ్డి జిల్లాలో ఇటీవల కవల సోదరులు కవల సోదరీమణులను వివాహం చేసుకున్న ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులు తిరగకుండానే కవల సోదరుల్లో ఒకరైన వినయ్ మృతిచెందడం కలకలం రేపుతోంది.
జిల్లాలోని మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్, వినయ్ కుమార్ అనే కవల సోదరులు గత ఫిబ్రవరిలో దేమిక్లాన్‌కు చెందిన కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణులను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. ఉగాది సందర్భంగా వినయ్ తన భార్యతో కలిసి సొంతూరికి వచ్చాడు.
తరువాత రోజు ఉదయం వినయ్ బైక్‌పై బయటకు వెళ్లి గంభీరావుపేట మండలం గోరంటాలలో బంధువును దింపి, అక్కడి నుంచి నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం వద్దకు చేరుకున్నాడు. కొంతసేపటికి అతని సోదరుడు విజయ్ అక్కడికి చేరుకోగా, వినయ్ చెప్పులు నీటిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జాలర్ల సహాయంతో గాలించి వినయ్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వినయ్ మరణం ఆత్మహత్యా లేదా ప్రమాదమా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. సెల్ ఫోన్ డేటా సహా పలు కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
పెళ్లై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. కొత్త జీవితంపై ఆశలతో అత్తారింటికి వచ్చిన కీర్తి పరిస్థితి విషాదంగా మారింది.
Full English News Article
A tragic incident has been reported from Kamareddy district in Telangana, where one of the twin brothers, who recently married a twin sister, was found dead within a month of marriage.
The incident involves twin brothers Vijay and Vinay Kumar from Ghanpur village in Machareddy mandal, who got married in February to twin sisters Keerthana and Keerthi from Demiklan. Their wedding had gained attention on social media. Recently, Vinay returned to his native village along with his wife for Ugadi.
On the following morning, Vinay left on a bike and dropped a relative at Gorantala in Gambhiraopet mandal. He later reached the Upper Manair reservoir near Narmal. Meanwhile, his brother Vijay, who followed him, found Vinay’s footwear near the water and alerted the police.
Police reached the spot and, with the help of local fishermen, recovered Vinay’s body from the canal. The body was shifted for postmortem examination, and a case has been registered.
Authorities stated that it is yet to be determined whether the death was a suicide or an accident. Police are investigating from multiple angles, including analysis of Vinay’s mobile phone data.
The incident has left the family devastated, especially as it occurred within a month of the wedding. The young bride’s hopes have been shattered, turning what began as a celebrated marriage into a heartbreaking tragedy.