Russian Oil Tanker अचानक India కి

అనూహ్య పరిణామం నేపథ్యంలో చైనాకు వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ చమురు మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది; Amid rising global tensions, a Russian oil tanker originally bound for China has suddenly rerouted to India, drawing attention in global energy markets.
సౌత్ చైనా సముద్ర జలాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాకు చెందిన ‘ఆక్వా టైటాన్’ ఆయిల్ ట్యాంకర్ చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సి ఉండగా, మధ్యలోనే భారత్ వైపు యూటర్న్ తీసుకుంది. ఈ నౌక మార్చి 21న న్యూ మంగళూరు పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని షిప్ ట్రాకింగ్ డేటా సూచిస్తోంది.
A significant development unfolded in the South China Sea as the Russian oil tanker ‘Aqua Titan,’ initially headed to Rizhao Port in China, made a sudden U-turn towards India. Ship tracking data indicates it is likely to reach New Mangalore Port by March 21.
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధిలో నౌకా రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఇరాన్ ఈ కీలక మార్గాన్ని బ్లాక్ చేయడంతో ప్రపంచ దేశాలు చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్ పొరుగు దేశాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినప్పటికీ, భారత్ ప్రస్తుతం నిల్వలతో పరిస్థితిని సమతుల్యం చేసుకుంటోంది.
Due to escalating tensions involving Iran, Israel, and the United States, movement through the Strait of Hormuz has been disrupted. Iran’s blockade has affected global oil supply chains, forcing several countries to face fuel shortages. While neighboring nations have increased fuel prices, India is managing the situation with existing reserves.
అమెరికా ఇటీవల రష్యాపై ఆంక్షలను కొంతవరకు సడలించడంతో, భారత్‌కు సముద్రంలో ఇప్పటికే ఉన్న చమురు సరఫరాలను కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఈ నిర్ణయం తర్వాత భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే చైనాకు వెళ్తున్న ఈ ట్యాంకర్‌ను కూడా భారత్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.
Following a partial easing of sanctions on Russia by the United States, India gained the opportunity to purchase oil already loaded on tankers at sea. As a result, India has significantly increased its imports of Russian crude, including diverting shipments originally meant for China.
ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సముద్ర పోర్ట్‌లో ఈ ట్యాంకర్‌లో చమురు లోడ్ చేయబడింది. భారత్, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతున్న నేపథ్యంలో, గ్లోబల్ ధరలపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత ఒక్క వారం వ్యవధిలోనే భారత్ దాదాపు 30 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది.
The tanker was loaded with crude oil at a Baltic Sea port in late January. With countries like India, South Korea, and Japan increasing imports from Russia, analysts believe global oil prices may face upward pressure again. Reports indicate that India alone imported nearly 30 million barrels of Russian oil within a week after sanctions were eased.