Cleanliness Drive in Kolthur Ward

ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మూడు చింతలపల్లి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మోర్సుభాయి శశి రేఖ పేర్కొన్నారు. To remain healthy, people must keep their surroundings clean, said Moinchintalapally Municipal Vice Chairperson Morsubai Shashi Rekha during a cleanliness drive in Shamirpet mandal.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్ల: శామీర్ పేట;మున్సిపల్ పరిధిలోని కొల్తూరు వార్డులో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మోర్సుభాయి శశి రేఖ మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్‌తో కలిసి రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
A cleanliness drive was conducted as part of the Shramadan programme in Kolthur ward of Moinchintalapally Municipality in Shamirpet mandal. Vice Chairperson Morsubai Shashi Rekha, along with Municipal Commissioner Pawan Kumar, participated in cleaning roads and surroundings.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Speaking on the occasion, she said maintaining cleanliness in residential areas can help prevent several diseases. Neglecting environmental hygiene may lead to various health problems, she added.
ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు ఈ తరహా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో స్వచ్ఛమైన వాతావరణాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Municipal officials said such awareness programmes would continue to encourage public participation in sanitation efforts and to maintain a clean environment.
ఈ కార్యక్రమంలో మేనేజర్ ఉషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గౌతమి, రాజేశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్, వార్డ్ కౌన్సిలర్లు మహేశ్వరి, జ్యోతి, రమేష్, మాజీ ఉపసర్పంచ్ రాంరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Manager Usha, Revenue Inspectors Gauthami and Rajeshwar Reddy, Sanitary Inspector Mohan Singh, ward councillors Maheshwari, Jyothi and Ramesh, former deputy sarpanch Ram Reddy and municipal staff participated in the programme.