హుస్నాబాద్లో శంకుస్థాపనలు అనంతరం అభివృద్ధిపై బహిరంగ సభ.

Husnabad Gets ₹170 Cr Projects; Ministers Inaugurate Key Works | Telugu News

హుస్నాబాద్లో శంకుస్థాపనలు అనంతరం అభివృద్ధిపై బహిరంగ సభ.

హుస్నాబాద్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో మంత్రి ప్రకటనలు
హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం బాలుర పాఠశాలలో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ హేమావతి, లైబ్రరీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ —

  • హుస్నాబాద్‌లో 82 కోట్లతో 150 పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన
  • 77.2 కోట్లతో కొత్తపల్లి–హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి (ఫేజ్ 2)
  • 11.5 కోట్లతో మాత శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం
  • గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నట్లు
  • శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ తరగతులు ఈ సంవత్సరం మొదలయ్యేలా ఏర్పాట్లు
  • అక్కన్నపేట–జనగాం మధ్య నాలుగు లైన్ రోడ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.

అభివృద్ధి పనుల్లో హుస్నాబాద్‌ను ముందుండే నియోజకవర్గంగా మార్చుతామని, ప్రజలు మళ్లీ గెలిపిస్తే అన్ని రంగాల్లో మరింత పురోగతిని అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలుగా — పంట పెట్టుబడి సహాయం, ఇళ్ల నిర్మాణం, సన్న వడ్లకు బోనస్, రుణ మాఫీ, మహిళల ఉచిత ప్రయాణం వంటి పథకాలను వివరించారు.


After inaugurating development works, a public meeting was held in Husnabad.

Development Push in Husnabad: Ministers Inaugurate Projects, Address Public
Husnabad:
Following the inauguration of various development works in Husnabad constituency, a large public meeting was held at the local boys’ school.

Ministers Tummala Nageshwar Rao, Damodara Rajanarasimha, Komatireddy Venkat Reddy, and Ponnam Prabhakar attended as key speakers. Manakondur MLA Kavvampalli Satyanarayana, Collector Hemavathi, Library and Market Committee chairpersons, and several departmental officials also participated.

Minister Ponnam Prabhakar announced:

  • Foundation laid for a 150-bed health center at a cost of ₹82 crore
  • Phase 2 of four-lane road from Kothapalli to Husnabad (₹77.2 crore)
  • Inauguration of 50-bed mother and child care center (₹11.5 crore)
  • Engineering classes to begin this year in Satavahana University campus
  • Gauravelli project canal works are underway
  • Four-lane road from Akkannapet to Jangaon coming soon

He urged people to re-elect him to continue Husnabad’s development across sectors and emphasized the Congress government’s initiatives like crop investment support, Indiramma houses, ₹500 bonus on fine rice, loan waivers, and free RTC travel for women.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *