హోలీ పండుగ ఆనందం, ఐక్యత, ప్రేమతో పండుగను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా జరుపుకోవాలనిముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

On the occasion of Holi, Chief Minister A. Revanth Reddy extended greetings to the people of Telangana and urged them to celebrate the festival with joy, unity, and in an eco-friendly manner.

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనందం, ఐక్యత, ప్రేమతో పండుగను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. On the occasion of Holi, Chief Minister A. Revanth Reddy extended greetings to the people of Telangana and urged them to celebrate the festival with joy, unity, and in an eco-friendly manner.

హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, స్నేహభావం నింపాలని ఆకాంక్షించారు. పవిత్రమైన ఈ పర్వదినం సమాజంలో ప్రేమ, శాంతి, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

హోలీ వేడుకలను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహజసిద్ధమైన రంగులు ఉపయోగిస్తూ, సాంప్రదాయ పద్ధతుల్లో పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *