హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు కేటీఆర్, కిషన్ రెడ్డి — సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్

హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు కేటీఆర్, కిషన్ రెడ్డి — సీఎం రేవంత్ రెడ్డి
KTR and Kishan Reddy are blocking Hyderabad’s development — CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ నేత కిషన్ రెడ్డి లను “బ్యాడ్ బ్రదర్స్”గా అభివర్ణిస్తూ, ఈ ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులుగా మారారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి నిజమైన అభివృద్ధి లభించిందని స్పష్టం చేశారు.
Chief Minister Revanth Reddy strongly criticized BRS leader K.T. Rama Rao and BJP leader Kishan Reddy, calling them the “bad brothers” who are obstructing Telangana’s development. He asserted that real progress in Hyderabad took place only under Congress rule.

జూబ్లీహిల్స్‌ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “గత 20 ఏళ్లలో ఎవరు అభివృద్ధి చేశారు అన్నది ప్రజలు ఆలోచించాలి. ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి కేసీఆర్, కేటీఆర్ డబ్బులు వసూలు చేసుకున్నారు. ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్లడానికి వీళ్ళిద్దరే కారణం. కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో కొకైన్‌తో పట్టుబడిన ఘటన గుర్తుందా? డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్ సన్నిహితులు బయటపడ్డారు. కాంగ్రెస్ కట్టిన ఓఆర్ఆర్‌ను అమ్మేసుకున్నారు” అని విమర్శించారు.
Speaking about Jubilee Hills development, he said, “Voters should think about who truly developed this area over the past 20 years. KCR and KTR collected money from L&T, pushing the company into losses. KTR’s relatives were caught in drug-related incidents. They even sold the ORR built by the Congress government.”

“ఫ్యూచర్ సిటీ, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులను ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీడపురుగుల్లా రాష్ట్రాన్ని తినేస్తున్నారు. మా ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చింది. మేము అధికారంలోకి రాగానే కంటోన్మెంట్‌ అభివృద్ధి ప్రారంభమైంది. జీసీసీ కంపెనీలను హైదరాబాద్‌కి తీసుకొచ్చాం” అని తెలిపారు.
“These bad brothers are blocking projects like Future City and the Musi River Rejuvenation,” he said. “BRS and BJP leaders are eating away the state like parasites. In just one and a half years, our government has brought in investments worth thousands of crores. The Cantonment development began only after we came to power, and we attracted several GCC companies to Hyderabad.”

“కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే ఉపయోగపడింది. ఒక్క ఎకరానికైనా సాగునీరు అందిందా? జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్‌ 1 నుంచి గ్రూప్‌ 4 వరకు నియామకాలు ప్రారంభించాం” అని పేర్కొన్నారు.
“The Kaleshwaram project only served for commissions, not for irrigation. Did even one acre get water from it? For Jubilee Hills to truly develop, Congress must win. After our government came to power, we started recruitments from Group 1 to Group 4,” he stated.

“గుజరాత్‌లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదులను శుభ్రం చేయవచ్చు… అయితే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? కేంద్రం ఇతర రాష్ట్రాలకు నిధులు ఇస్తే, తెలంగాణకు ఎందుకు ఇవ్వదు? కేటీఆర్ ఒక చీడ పురుగు, కిషన్ రెడ్డి ఎందుకు సహకరిస్తున్నారు? బీఆర్ఎస్ నేతలు చెరువులు, పార్కులు కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్ మునగాలా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“If Sabarmati in Gujarat, Ganga in UP, and Yamuna in Delhi can be cleaned, why not Musi in Hyderabad? The Centre funds river cleaning in other states but denies it to Telangana. KTR is acting like a pest, and Kishan Reddy is supporting him. BRS leaders have encroached on lakes and parks — should Hyderabad drown because of them?” Revanth Reddy concluded.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *