Due to Bonalu festivities, traffic diversions will be in effect on July 20 and 21 in several parts of Hyderabad to avoid inconvenience to devotees, according to the city traffic police.

హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. 20, 21 తేదీల్లో ఈ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదు
Due to Bonalu festivities, traffic diversions will be in effect on July 20 and 21 in several parts of Hyderabad to avoid inconvenience to devotees, according to the city traffic police.
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకల సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలై 20, 21 తేదీల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ముఖ్యంగా జూలై 21న లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల వేడుకల సందర్భంగా ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు.
ట్రాఫిక్ మార్గంలో మార్పులు ఇలా ఉండనున్నాయి:
- ఇంజన్ బౌలి, ఫలక్‌నుమా వైపు నుంచి అలియాబాద్ వెళ్లే వాహనాలను న్యూ షంషేర్ గంజ్ మీదుగా గోశాల, మిస్రీగంజ్ వైపు మళ్లిస్తారు.
- మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి అలియాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇంజన్ బౌలి మీదుగా జహనుమా, గోశాల వైపునకు మళ్లిస్తారు.
- నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజాకు వెళ్లే వాహనాలను గౌలిపురా వైపునకు మళ్లిస్తారు.
- చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపునకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపునకు డైవర్ట్ చేస్తారు.
భక్తుల వాహనాల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు:
బోనాల సందర్భంగా వచ్చే భక్తుల వాహనాలను పార్క్ చేసేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. షాలిబండ ప్రధాన రోడ్, ఆర్యవైశ్య మందిర్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టర్మినల్, ఢిల్లీ గేట్ వద్ద పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.