The Chief Minister directed officials to continue the land originally allotted to Sharada Peetham in Kokapet, Hyderabad, cancelling its allocation to the Water Board.
హైదరాబాద్‌లోని కోకాపేట భూముల విషయంలో శారదా పీఠానికి కేటాయింపులు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. The Chief Minister directed officials to continue the land originally allotted to Sharada Peetham in Kokapet, Hyderabad, cancelling its allocation to the Water Board.
హైదరాబాద్‌లో కోకాపేట ప్రాంతంలో శారదా పీఠానికి కేటాయించిన భూములను తిరిగి పీఠానికే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. పీఠం భూములను జల మండలికి కేటాయించిన తర్వాత అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులపై పీఠం ప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాల ప్రస్తుత స్థితిని తెలుసుకున్నారు. భూములను జల మండలికి కేటాయించే సమయంలో అక్కడ కొనసాగుతున్న నిర్మాణాల వివరాలు సమగ్రంగా తెలియజేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో జల మండలికి చేసిన కేటాయింపులను రద్దు చేసి, భూములను శారదా పీఠానికే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల పురోగతి, ప్రస్తుత పరిస్థితులపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వివరించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.
In a review meeting held at the State Secretariat, the Chief Minister examined the present status of the constructions being undertaken by Sharada Peetham in Kokapet. He expressed displeasure over the fact that the status of ongoing works was not properly conveyed at the time of allocating the land to the Water Board.
He ordered cancellation of the allotment made to the Water Board and directed that the land be continued in favour of Sharada Peetham. The Peetham representatives were advised to meet Minister Duddilla Sridhar Babu and explain the construction progress and related circumstances.