సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే సదరు స్థలంపై తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది . దాంతో ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది.