
హెల్త్ టూరిజం హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది – CM రేవంత్ రెడ్డి | Telangana emerging as a hub for health tourism, says CM Revanth Reddy
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో AIG ఆస్పత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం వైద్య సేవల రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. 66 దేశాల నుంచి రోగులు వచ్చి చికిత్స పొందే స్థాయికి AIG ఆసుపత్రి చేరుకుందని ప్రశంసించారు.
Chief Minister Revanth Reddy inaugurated the AIG Hospital in Banjara Hills, Hyderabad, and stated that Telangana is fast emerging as a national model in healthcare services. He appreciated AIG Hospital for reaching a global standard, attracting patients from over 66 countries.
ఈ సందర్భంగా ఎఐజి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ, తనవంతు ప్రయత్నం చేస్తానని రేవంత్ తెలిపారు. అలాగే, హెల్త్ టూరిజాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వానికి నాగేశ్వర్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
The Chief Minister urged the central government to honor AIG Chairman Dr. Nageshwar Reddy with the Bharat Ratna and assured he would advocate for the same. He also appealed for Nageshwar Reddy’s cooperation in expanding Telangana’s health tourism initiatives.
భారతదేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్లలో 35 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతుందన్న సీఎం, ఫార్మా రంగ అభివృద్ధికి ఐడిపిఎల్ మాజీ ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయ మార్గదర్శనాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు.
Revanth noted that 35% of India’s bulk drugs are manufactured in Hyderabad, attributing the pharma sector’s growth to former IDPL employees. He also said expert advice from Dr. Nori Dattatrey is being considered for cancer care improvements.
క్యాన్సర్ వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్య వివరాలను ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతగా ప్రతి వైద్యుడు ఏడాదిలో కనీసం ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాలని సూచించారు.
Addressing women’s health concerns, the CM revealed plans to record their medical data to ensure focused care. He appealed to private doctors to dedicate at least a month annually to work in government hospitals as part of social responsibility.
‘జనని మిత్ర’ యాప్ పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొంటూ, నిమ్స్‌లో అదనపు బ్లాక్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లలో ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్‌కు హాజరైన మహిళలు ఎఐజి ఆస్పత్రిని సందర్శించాలని తాను సూచించానని కూడా పేర్కొన్నారు.
He praised the “Janani Mitra” app for aiding poor patients and announced new government hospitals in LB Nagar and Sanathnagar, along with an additional block at NIMS. He also invited Miss World participants to visit AIG Hospital as part of their health awareness engagement.