హుస్నాబాద్ లో సుమారు 7 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్…

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో ₹ 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, ₹ 1 కోటితో గిరిజన బాలికల కళాశాల వసతి గృహం, ₹ 2 కోట్లతో టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనం, ₹ 1.5 కోట్లతో నిర్మించిన మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్, మరియు బస్తీ దవాఖాన భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్ వినోద్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *