హీరోయిన్‌ డిరపుల్‌ హాయతి పై క్రిమినల్‌ కేసు…


పార్కింగ్‌ చేసిన వాహనాన్ని ఢీ కొట్టిన హీరోయిన్‌ డిరపుల్‌ హాయతిపై పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డిసిపి రాహుల్‌ హెగ్డే కారును మరో కారుతో ఢీ కొట్టి ధ్వంసం చేసిన వ్యవహారం ఇది. డిరపుల్‌ తో పాటు డేవిడ్‌ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ వుంటున్న అపార్ట్‌ మెంట్‌ లోనే నటి డిరపుల్‌, డేవిడ్‌ ఉంటున్నారు. ట్రాఫిక్‌ డిసిపి వాహనానికి డ్రైవర్‌ గా ఉన్న కానిస్టేబుల్‌ చేతన్‌ కుమార్‌ అక్కడి సెల్లార్‌ లో పార్కింగ్‌ చేస్తున్నారు. ఆయన వాహన పక్కనే నటి డిరపుల్‌ హాయితి డేవిడ్‌ తమ వాహనాన్‌ పార్కింగ్‌ చేస్తున్నారు . ప్రతిరోజు డిసిపి వాహనానికి తొలగించడం కాలితో తన్నడం చేస్తున్నారు. ఈ నెల 14న డిరపుల్‌ హాయతి తన వాహనంతో డిసిపి వాహనాన్ని ఢీ కొట్టింది. డీసీపీ డ్రైవర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వివరాలు తెలుసుకుని పోలీసులకు పిర్యాదు చేసాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *