హర్యానాలోని ఒక గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం కలకలం రేపింది. చాలా ఇళ్లలో జ్వరం, వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో తాగునీటి కలుషితమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.Twelve deaths in 15 days

హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్ జిల్లా చాయన్సా గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం కలకలం రేపింది. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉండటం గ్రామస్తుల్లో ఆందోళన కలిగించింది.

గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా మారింది. తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తమైంది.

107 ఇళ్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో 23 చోట్ల బ్యాక్టీరియా కాలుష్యం, తక్కువ క్లోరినేషన్ గుర్తించారు. స్టోరేజ్ ట్యాంకుల్లో కోలిఫాం బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు తేలింది.

జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మధ్య జరిగిన మరణాలు తీవ్రమైన హెపటైటిస్ లేదా కాలేయ సమస్యలతో సంబంధం ఉన్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, కామెర్లు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.

గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వేలు చేస్తున్నారు. దాదాపు 1,500 మందికి పరీక్షలు నిర్వహించారు. 210 రక్త పరీక్షల్లో హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు గుర్తించారు. హెపటైటిస్ ఎ, ఇ నెగటివ్‌గా వచ్చాయి.

నీటి శుద్ధి కోసం 15 వేల హాలోజన్ మాత్రలు పంపిణీ చేసి, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. నీటి కాలుష్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.
A health alert has been issued in Chayansa village, Palwal district of Haryana, after 12 deaths were reported within 15 days. Five of the deceased were school students, causing concern among villagers.

Officials said nearly every household reported at least one person suffering from fever and vomiting, with some cases turning serious. Preliminary investigations suggest contaminated drinking water as a possible cause.

Water samples collected from 107 households showed bacterial contamination in 23 samples, along with inadequate chlorination. Authorities also detected coliform bacteria in storage tanks.

Health officials noted that many deaths were linked to severe hepatitis or liver-related complications between late January and mid-February. Symptoms included fever, stomach pain, vomiting, and jaundice.

Medical camps have been set up in the village, home surveys are underway, and more than 1,500 people have been screened. Around 210 blood tests identified hepatitis B and hepatitis C positive cases, while hepatitis A and E were negative.

Officials distributed about 15,000 halogen tablets for water purification and set up a helpline to assist residents. The investigation into water contamination and health impact is continuing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *