
హరి హర వీరమల్లు ట్రైలర్ అదిరింది | Hari Hara Veeramallu Trailer Roars with Powerful Visuals and Dialogues
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నదో అదే సంచలన ఘట్టం ఇప్పుడు జరిగింది. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల అయింది. జూలై 24న సినిమావిడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జూలై 3న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలతో సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
Pawan Kalyan’s much-awaited period action film Hari Hara Veeramallu has finally dropped its trailer, sending waves of excitement across his massive fanbase. With the film scheduled for release on July 24, the trailer launched on July 3 has dramatically raised expectations with its grand visuals, gripping background score, and intense dialogues.
ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం ప్రారంభించగా, చివరికి జ్యోతి కృష్ణ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ముఖ్యంగా బాబీ డియోల్ నటనతో ట్రైలర్ మరింత పవర్ఫుల్‌గా మారింది. ఔరంగజేబు పాత్రను మొదట వేరే నటుడితో చేయించారట. కానీ ‘యానిమల్’ చిత్రం చూసిన తర్వాత జ్యోతి కృష్ణ మాత్రం ఈ పాత్రకు బాబీ డియోల్ సరిగ్గా సరిపోతాడని భావించి మళ్లీ రీషూట్ చేశారట.
The directorial reins were initially held by Krish but eventually passed to Jyothi Krishna, who completed the film with his own vision. The trailer highlights Bobby Deol’s powerful presence as Aurangzeb, a casting decision that came after the director was impressed with Deol’s performance in Animal, leading to a complete reshoot of the character’s scenes.
ట్రైలర్‌లోని డైలాగులు:
“ఇది నేను రాసే చరిత్ర.. సింహాసనమా? మరణశాసనమా?”
“పులిని వేటాడే బెబ్బుల్ని ఇప్పుడు చూస్తారు…”
“ఈ దేశం మా బాద్ షా పాదాల కింద నలిగిపోతోన్న సమయం…”
These lines have elevated the trailer to another level, showcasing a larger-than-life portrayal of the lead character. Every shot seems designed to give Pawan Kalyan an impactful screen presence.
వీఎఫ్ఎక్స్ పనుల్లో రాజీపడకుండా జ్యోతి కృష్ణ కఠినంగా పనిచేశారని సమాచారం. ఇవే కారణంగా సినిమా వాయిదాలు జరిగాయని తెలుస్తోంది. ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ కూడా జ్యోతి కృష్ణను ప్రత్యేకంగా అభినందించినట్టు తెలుస్తోంది.
The filmmakers took no shortcuts in visual effects (VFX), which reportedly caused the multiple delays. After watching the final trailer, even Pawan Kalyan is said to have personally appreciated director Jyothi Krishna.