
స్థంభానికి ఢికొట్టిన కారు..ఒకరు మృతి
హైదరాబాద్
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు ఉషా ఫ్యాన్ కంపెనీ ముందు గల స్తంభానికి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ముస్తాక్(19) అనే యువకుడుగా గుర్తించారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.