సొంతగూటికి రాజగోపాల్‌ రెడ్డి రానున్నారా…. త్వరలో స్పష్టత రానున్నదిని తెలుస్తోంది..


రాష్ట్రంలో బీజేపీ భవితపై అనుమానం
మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి యోచన
3 రోజులుగా అనుచరులతో చర్చలు` మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని వ్యాఖ్యలు
హైదరాబాద్‌ : కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రకంపనలు తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే మొదలయ్యాయా? కాంగ్రెస్ ను వీడిన నాయకులు పునరాలోచనలో పడుతున్నారా? మొన్నటిదాకా బీజేపీ వైపు చూసిన నేతలంతా మళ్లీ చేయందుకోవడానికే సిద్ధమవుతున్నారా.. అంటే అవుననే తెలుస్తోంది. రaార్ఖండ్‌లో తన కంపెనీకి రూ.18వేల కోట్ల టెండర్‌ దక్కడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్తే తాను తిరిగి కాంగ్రె?సలో చేరే విషయమై ఆలోచిస్తానని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అనుయాయులతో అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీలోనే కొనసాగాలా.. మళ్లీ కాంగ్రె?సలోకి వెళ్లాలా అన్న విషయమై రాజగోపాల్‌ మూడు రోజులుగా అన అనుయాయులతో చర్చిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో ఆయన కాంగ్రె?సలో చేరడం వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే, రేవంత్‌ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారని పేర్కొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు తర్వాత బీజేపీ మరింత బలహీనంగా మారిందని, తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే ప్రసక్తి లేదని రాజగోపాల్‌ తన అనుయాయులతో అన్నారు. ఈటలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం అప్పగించినా..మరో ఆరు నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని వివరించారు. కాంగ్రెస్‌ క్రమంగా పుంజుకుంటున్న కారణంగా వేరే పార్టీలవారెవరూ బీజేపీలో చేరబోరని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్‌ కూడా పడిపోతున్నదని వివరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేశారు. అయితే, బీజేపీ దయాదాక్షిణ్యాలతోనే తనకు టెండర్‌ దక్కిందన్న ఆరోపణలను రేవంత్‌ వెనక్కు తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్తే అప్పుడు కాంగ్రె?సలో చేరే విషయమై ఆలోచించవచ్చునని రాజగోపాల్‌ అనుయాయులకు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *