In Hyderabad, the ED has arrested Dr. Namrata and her son in the Srishti surrogacy case. They are accused of purchasing infants from tribal families and running a multi-crore fraud under the guise of surrogacy, with a money laundering probe underway.

సృష్టి సరోగసి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించి డాక్టర్ నమ్రత మరియు ఆమె కుమారుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాల వద్ద నుంచి శిశువులను కొనుగోలు చేసి, వాటిని సరోగసి ద్వారా పుట్టినట్లుగా చూపించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో భాగంగా ఈడీ నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు సమాచారం. నిధుల మార్పిడి, అక్రమ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇక సరోగసి ముసుగులో శిశు అక్రమ రవాణా కూడా జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. సంబంధిత పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరిస్తూ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
The Srishti surrogacy case has taken a significant turn with the Enforcement Directorate arresting Dr. Namrata and her son in Hyderabad. Authorities allege that infants were purchased from tribal families and falsely projected as surrogacy births to collect huge sums of money.
During searches at Srishti Fertility Center, officials reportedly identified illegal assets worth around ₹30 crore and froze eight bank accounts linked to the case. The ED is probing the financial transactions under the Prevention of Money Laundering Act.
Investigators are also examining whether child trafficking was carried out under the cover of surrogacy. Officials are analysing documents and financial records as the investigation deepens.