సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట…


న్యూఢల్లీ : సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్‌ నాథ్‌ షిండే చీఫ్‌ విఫ్‌ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్‌ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పార్టీ విభేదాలను ప్రభుత్వంపై రుద్దకూడదని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమకోహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించిం
అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ తొలుత ఏక్‌నాథ్‌ షిండే సుప్రీంను ఆశ్రయించారు. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్‌ చేపట్టిన చర్యను సవాల్‌ చేస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును బదిలీ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపర్చిన అనర్హత అంశాలతో పాటు ఆర్టికల్‌ 226, ఆర్టికల్‌ 32 సహా అనేక రాజ్యాంగపరమైన అంశాలపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్‌ను తొలగించాలంటూ ఒక పిటిషన్‌ పెండిరగులో ఉండగా, ఆ స్పీకర్‌ అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకోవడం కుదరదని షిండే వర్గం వాదించింది.
నబం రెబియా కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసుపై విచారణ కొనసాగుతుండగానే ఏక్‌నాథ్‌ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఉద్ధవ్‌ ఠాక్రే తరఫున ప్రముఖ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వి, దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. షిండే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాదులు నీరజ్‌ కిషన్‌ కౌల్‌, హరీశ్‌ సాల్వే, మహేశ్‌ జెఠ్మలానీ, మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర గవర్నర్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *