సుప్రసిద్ధ సాహితీవేత్త రవ్వ శ్రీహరి ఇకలేరు… సంస్కృతాంధ్ర భాష‌ల‌కు తీర‌ని లోటన్న సాహితీవేత్తలు, రచయితలు..

నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు శ్రీహరి. అంచలంచలుగా ఎదిగిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్య‌క్షులు, ద్రావిడ యూనివ‌ర్సిటీ మాజీ వీసీ ఆచార్య ర‌వ్వా శ్రీహ‌రి శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా రవ్వ శ్రీహరి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నరు. కాగా నిన్న రాత్రి ర‌వ్వా శ్రీహ‌రి క‌న్నుమూసిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ర‌వ్వా శ్రీహ‌రి మృతిప‌ట్ల ప‌లువురు సాహితీవేత్త‌లు, ర‌చ‌యిత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. అతని కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణం సంస్కృతాంధ్ర భాష‌ల‌కు తీర‌ని లోటు అని సాహితీవేత్త‌లు ఉటంకించారు.

రవ్వ శ్రీహరి నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన, ఇతను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల కుటుంబానికి ఇతనే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్‌ లోని సీతారాంబాగ్‌లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివాడు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నాడు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశాడు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా 1967 లో పనిచేశాడు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నాడు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002 లో ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు.

నిఘంటువులు

శ్రీహరి నిఘంటువు
అన్నమయ్య పదకోశం
సంకేత పదకోశం
వ్యాకరణ పదకోశము (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి)
నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం
విమర్శా గ్రంథాలు

ఉభయ భారతి[5]
అన్నమయ్య సూక్తివైభవం
అన్నమయ్య భాషావైభవం
తెలుగులో అలబ్ధవాఙ్మయం
సాహితీ నీరాజనం
తెలుగు కవుల సంస్కృతానుకరణలు
వాడుకలో తెలుగులో అప్రయోగాలు
తెలంగాణా మాండలికాలు – కావ్యప్రయోగాలు
నల్లగొండజిల్లా ప్రజలభాష
వ్యాకరణ గ్రంథాలు
సవరించు
సిద్ధాన్త కౌముది
అష్టాధ్యాయీ వ్యాఖ్యానం
ఇతర గ్రంథాలు
సవరించు
శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రమ్, నామావళి
అలబ్ధ కావ్య పద్య ముక్తావళి
సంస్కృతన్యాయదీపిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *