టీఎస్పీఎస్సీ లో లీక్ అయినవి 15 పేపర్లు, రద్దు అయినవి 6 పరీక్షలు, రోడ్డున పడ్డది 10లక్షల మంది నిరుద్యోగులు. ‘కీలక నిందితులు’ అని తేల్చింది ఇద్దరిని మాత్రమే. ఇదీ చిన్న దొర ఆధ్వర్యంలో నడిచిన సిట్ రిపోర్టుని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. గతంలో డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాగే ప్రశ్నాపత్రాల కుంభకోణాన్ని సిట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.ఒక్క పేపర్ లీక్ అయితే బయటికి పొక్కే విషయం, 15 పేపర్లు లీక్ అయ్యేదాకా బయటకు రాలేదంటే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదంటారా? సర్వర్ నుంచి పేపర్స్ లీక్ అయ్యాయంటే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రమేయం లేదంటారా? ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం విూకుందా? విూరు నిర్దోషులైతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నట్లు? నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారా? కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సిగ్గురాని ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోస పట్టదు. నిరుద్యోగుల కోసమే టీ సేవ్ ఏర్పడిరది. నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా పార్టీలకు అతీతంగా టీ సేవ్ ఇ పోరాడుతుంది. ఇందులో నిరుద్యోగులు, విద్యార్థులు సైతం భాగస్వాములై ఈ నెల 17న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి, ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని మనవిని అన్నారు.