సీఎంపీఎఫ్‌ ఆన్‌లైన్‌ సేవలు… బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం


గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఏర్పడనుంది. ప్రతీ సంవత్సరం ఎంత నిల్వ అవుతుందన్న వివరాలను ఆన్‌లైన్‌లోనే వివరా లు తెలుసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ నిల్వ వివరాలు తెలుసుకునేందుకు జాబితాలు పంపిణీ చేయాలని కార్మికులు అడిగే పరిస్థితి లేకుండా సీఎంపీఎఫ్‌ (కోల్‌ మైన్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది మే నాటికి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బొగ్గుగని కార్మికులకు సంబంధించి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆ ఏడాదికి సంబంధించిన నిల్వ ఎంత జమ చేశారన్నది వివరాలతో కూడిన జాబితాను అందిస్తారు. కరోనా కారణగా 2019, 2020లో ఆలస్యంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత అందించ లేదు. దీంతో కార్మిక సంఘాల నాయకులు సీఎంపీఎఫ్‌ నిల్వ జాబితాలను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధిం చిన సీఎంపీఎఫ్‌ నిల్వకు సంబంధించిన చీట్టీలు కూడా అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను సీఎంపీఎఫ్‌ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
సీఎంపీఎఫ్‌ నంబరుతో..
ప్రతీ కార్మికుడికి సీఎంపీఎఫ్‌ నంబరు ఉంటుంది. దీని ఆధారంగా ఆన్‌లైన్‌లో తమ నిల్వ నిధిని చూసుకునే అవకాశం ఇక నుంచి అందుబాటులోకి రానుంది. బొగ్గుగని కార్మికులు తమ వాటా కింద కొంత చెల్లిస్తే యాజమాన్యం ంతే మొత్తం కలిపి నిల్వ చేస్తుంది. సీఎంపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన నిల్వను కార్మికులు చూసుకోవడానికి చర్యలు చేపట్టారు.
అధికారులతో మాట్లాడాం
వై.సత్తయ్య, బీఎంఎస్‌ నాయకులు
సీఎంపీఎఫ్‌ నిల్వ మొత్తం చూసుకోవడానికి అధికారులతో తమ నాయకులు మాట్లాడారు. 23న రాంచిలో సీఎంపీఎఫ్‌ అధికారులను కలిసి నిల్వ వివరాలకు సంబంధించిన కార్మికులకు పంపిణీ చేసే జాబితాల వివరాలు వెంటనే అందించాలని చర్చించారు. ఇక నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *