
సిద్దిపేట యువ సమ్మేళనంలో హరీష్ రావు: “మీరు నా ఆత్మీయ తమ్ముళ్లు”
సిద్దిపేట,
సిద్దిపేటలో జరిగిన యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు.
“మీరు నేను ఒకే కుటుంబం… మీ పట్టుదల నా గుండెల్లో నిలిచిపోతుంది” అని హరీష్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
గులాబీ జెండా రజతోత్సవం సందర్భంగా సిద్ధిపేట నుంచి వరంగల్ వరకూ పాదయాత్ర చేసిన యువతను ఆయన అభినందించారు.
యువత మద్యం, డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని, జీవితానికి మలుపు ఇచ్చే 25-50 ఏళ్ల వయస్సును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
ప్రతి ఒక్కరు జీవితంలో నిలదొక్కుకోవాలనీ, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు.
“ఇంకో మూడేళ్లలో మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది” అంటూ రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు.