సెన్సెక్స్ జోష్.. భారీ లాభాలు

Stock Market Rally: Sensex Jumps 1400 Points, Investors Gain ₹1.78 Lakh Crore

భారత స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకుని వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. RBI విధాన ప్రకటనకు ముందు సెన్సెక్స్ ఇంట్రాడేలో 1400 పాయింట్లు పెరిగి ఇన్వెస్టర్ల సంపద రూ. 1.78 లక్షల కోట్లు పెరిగింది.
Indian stock markets extended gains for the fourth straight session ahead of the RBI policy announcement, with Sensex surging 1400 points intraday and investor wealth rising by ₹1.78 lakh crore.

భారత స్టాక్ మార్కెట్లలో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ ఒక దశలో 800 పాయింట్లకుపైగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది.

మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం వల్ల కొనుగోళ్లు పెరిగాయి. కనిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 510 పాయింట్ల లాభంతో 74,617 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 23,124 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్ మొత్తం 1400 పాయింట్లకు పైగా పుంజుకోవడం మార్కెట్లో ఉత్సాహాన్ని పెంచింది.

ఈ ర్యాలీకి ఐటీ స్టాక్స్ ప్రధాన కారణంగా నిలిచాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతం పైగా పెరిగాయి. విప్రో దాదాపు 4 శాతం లాభపడగా, టెక్ మహీంద్రా కూడా బలంగా పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మద్దతునిచ్చాయి.

ఈ ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1.78 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 429.26 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చిలో భారీ పతనం తర్వాత ఏప్రిల్‌లో మార్కెట్లు పుంజుకోవడం గమనార్హం.


On the back of global cues and easing crude prices, Indian stock markets staged a strong recovery after opening weak. The Sensex initially fell over 800 points due to geopolitical tensions involving Iran, Israel, and the United States, impacting investor sentiment.

However, buying interest emerged in the latter half of the session. Positive global signals and cooling oil prices supported the recovery. Investors showed interest at lower levels, helping indices bounce back sharply.

The BSE Sensex ended 510 points higher at 74,617, while the NSE Nifty gained 155 points to close at 23,124. Notably, the Sensex surged more than 1400 points from its intraday low, reflecting strong momentum.

IT stocks led the rally, with TCS, Infosys, and HCL Technologies rising over 2 percent. Wipro gained nearly 4 percent, while Tech Mahindra also advanced. Banking stocks also supported the rally ahead of the RBI monetary policy announcement.

Investor wealth increased by ₹1.78 lakh crore in a single session, taking total market capitalization to ₹429.26 lakh crore. After a sharp fall in March, markets are showing signs of recovery in April.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *