
సచివాలయ సిబ్బంది ప్రజల సేవలో నిబద్ధతతో పని చేయాలి: కమిషనర్ హరిప్రసాద్
Ward Secretariat Staff Must Work Responsibly in Public Service: Commissioner Hariprasad
బేతంచర్ల పట్టణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కమిషనర్ హరిప్రసాద్, సచివాలయ సిబ్బందిని ప్రజల సేవలో నిబద్ధతగా పనిచేయాలని ఆదేశించారు.
Commissioner Hariprasad held a meeting with newly appointed staff at the Betamcherla Municipal Office on Friday, urging them to serve the public with dedication.
పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వార్డు సచివాలయాలకు కొత్తగా వచ్చిన సిబ్బందితో కమిషనర్ హరిప్రసాద్ మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సమర్థవంతంగా స్వీకరించి, వాటికి తగిన పరిష్కారం అందించడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. మీ పరిధిలో తల్లికి వందనం, ఈకేవైసీ, పి4 సర్వే వంటి కీలక కార్యక్రమాలు ఉన్నచోట వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
సచివాలయ సిబ్బంది తమ పనిని నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. అదే విధంగా, నేడు నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి అందరూ హాజరై సహకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.