Anganwadi Teacher Assaulted in Sangareddy

సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్‌పై గ్రామస్థుల దాడి ఘటన కలకలం రేపింది. భర్త అప్పుల వివాదంతో సంబంధం లేకపోయినా మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
A shocking incident in Sangareddy district has sparked outrage after an Anganwadi teacher was tied to a tree and assaulted by villagers over her husband’s financial dispute.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి రాసోల్‌లో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రభాకర్ గ్రామస్తుల వద్ద నుంచి ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో గ్రామానికి పనికి వచ్చిన వసంతకుమారిని కొంతమంది గ్రామస్థులు అడ్డుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఆమె ఎంత వేడుకున్నా వినకుండా గంటకు పైగా చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని కూడా బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆమెను విడిచిపెట్టారు. తీవ్ర గాయాలతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు వ్యక్తులపై విచారణ ప్రారంభించారు. భర్త చేసిన ఆర్థిక వివాదానికి సంబంధం లేకుండా మహిళపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
In Rasool village of Kangti మండలం in Sangareddy district, the incident took place involving an Anganwadi teacher named Vasantha Kumari from Damaragidda. Allegations suggest that her husband Prabhakar had collected money from villagers under a finance scheme and failed to repay it.
Angered over this, a group of villagers reportedly targeted Vasantha Kumari when she came for work. They allegedly dragged her by her hair, tied her to a tree, and assaulted her for over an hour. Despite her pleas, the attackers continued the abuse.
The victim also stated that she was threatened with further humiliation, including cutting her hair and parading her on a donkey. The situation was brought under control after village elders intervened and rescued her.
Following the incident, the victim approached the police. Officials have registered a case against five individuals and launched an investigation. The incident has triggered public outrage, with many questioning the attack on a woman who had no direct involvement in the financial dispute.