సంఘం స్థలం కబ్జా కొరల నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా మేము మంత్రి మల్లారెడ్డితో ముందుకు సాగుతాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గణేష్ చిటిమల్ల, అలియాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పడిగే రవీందర్

శామీర్ పేట (గరుడ వార్త) :   సికింద్రాబాద్ చేనేత సహకార సంగం స్థలం కబ్జా కోరల నుండి కాపాడినందుకు, కృతజ్ఞతగా మేమంతా మంత్రి మల్లారెడ్డి వెంటే ముందుకు సాగుతామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గణేష్ చిటిమల్ల, అలియాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు  పడిగే రవీందర్ స్పష్టం చేశారు. ఆదివారం శామిరపేట మండల, అలియాబాద్, జనార్ధన్ నగర్ కాలనీ, గాంధీ బొమ్మ వద్ద కృతజ్ఞతా పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పడిగే రవీందర్ మాట్లాడుతూ.. తాము సమస్యల్లో సతమతం అవుతున్నప్పుడు, తానున్నానంటూ తమ సంఘాన్ని కబ్జా కోరల నుండి కాపాడిన మంత్రి మల్లారెడ్డి వెంటే అలియాబాద్ పద్మశాలి సోదరులు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జడ్పిటిసి అనిత లాలయ్య మాట్లాడుతూ… ఈసారి మంత్రి మల్లారెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన, తర్వాత తప్పకుండా పద్మశాలి భవనం ఏర్పాటుకు మంత్రి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ మాట్లాడుతూ… తాను ప్రమాణ పూర్తిగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కేవలం సంఘ అభివృద్ధికి కొరకే తాను బి ఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా స్పష్టం చేశారు. ఆపద సమయంలో సంఘ స్తలం కబ్జాకాకుండా అండగా నిలబడ్డ మంత్రి మల్లారెడ్డికి, రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటుని బిఆర్ఎస్ పార్టీకే వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ, పద్మశాలి పెద్దలు, వార్డు సభ్యులు టిల్లుతో పాటుగా భారి సంఖ్యలో పద్మశాలి సోదరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *