Annadanam Held at Sri Renuka Yellamma Temple in Shamirpet

శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. Devotees were served free food after special prayers at Sri Renuka Yellamma Temple in Shamirpet.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట: శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు భక్తి భావంతో అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని శామీర్‌పేటకు చెందిన డాక్టర్ సాయి కృష్ణ–కనక దుర్గాదేవి దంపతులు, వారి కుమారుడు పవన్ కృష్ణ మరియు కుటుంబ సభ్యులు నిర్వహించారు. అలాగే శామీర్‌పేట సెలబ్రిటీ ప్రాంతానికి చెందిన మంచి కట్ల రాములు–అనురాధ దంపతులు, కుమార్తె అనన్య ఆలయ అన్నదాన కార్యక్రమానికి 25 కిలోల బియ్యం అందజేశారు.

ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజీవ్ రహదారి మార్గంలో ప్రయాణిస్తున్న భక్తులు కూడా అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులతో సందడిగా కొనసాగింది.
Special prayers were conducted on Tuesday at Sri Renuka Yellamma Temple in Shamirpet, followed by distribution of free food to devotees visiting the temple.
The Annadanam programme was organised by Dr. Sai Krishna and Kanaka Durgadevi along with their son Pawan Krishna and family members from Shamirpet. In support of the initiative, Manchi Katla Ramulu and Anuradha from Celebrity area in Shamirpet, along with their daughter Ananya, donated 25 kilograms of rice for the temple’s food distribution programme.
Devotees visiting the temple, former public representatives and travellers passing along the Rajiv Rahadari road also received the prasadam. The event witnessed participation from several devotees and was conducted in a devotional atmosphere.