శామీర్‌పేట్‌లో హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు – రూ.30 వేల జరిమానా…

Hotel Hygiene Inspection in Shamirpet

అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోటళ్లలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి హెచ్చరించారు. Aliyabad Municipal Chairperson Kantham Shirisha Krishna Reddy warned that hotels must strictly maintain hygiene standards during inspections conducted in Shamirpet mandal.

శామీర్‌పేట్ మండలం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లలో పరిశుభ్రత పరిస్థితులను మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా తుర్కపల్లి ప్రాంతంలోని హోటళ్లను చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పరిశీలించారు.

During the inspection drive held under the Praja Palana–Pragati Palana initiative, the municipal chairperson inspected several hotels in Turkpally area of Aliyabad Municipality in Shamirpet mandal.

ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యాలు తప్పనిసరిగా పరిశుభ్రతను పాటిస్తూ ఆహార పదార్థాల తయారీ మరియు నిల్వలో ఆరోగ్య నిబంధనలను అనుసరించాలని ఆమె సూచించారు. నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

She advised hotel owners to strictly follow hygiene practices and food safety norms while preparing and storing food items. Strict action would be taken against those who violate sanitation rules, she warned.

పరిశుభ్రత పాటించని తుర్కపల్లి ప్రాంతంలోని రెండు హోటళ్లకు, మజీద్‌పూర్‌లోని ఒక హోటల్‌కు మున్సిపల్ అధికారులు మొత్తం రూ.30 వేల జరిమానా విధించారు.

Municipal authorities imposed a total fine of ₹30,000 on two hotels in Turkpally and one hotel in Majidpur for failing to maintain proper hygiene.

తరువాత తుర్కపల్లి తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి రోడ్లను శుభ్రం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అవసరమని అధికారులు తెలిపారు.

Sanitation works were also carried out in Turkpally Thanda where municipal staff cleaned roads and surroundings to improve public hygiene conditions.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు, ఇంచార్జి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి ఆర్‌ఓ వేణుగోపాల్, ఇంచార్జి ఆర్‌ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Municipal Commissioner Chandrasekhar, councillors, in-charge manager Srinivas Reddy, RO Venu Gopal and RI Vijay Kumar were among the officials who participated in the inspection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *