
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి
భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,56,554 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 872.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 152.4941 టీఎంసీలుగా కొనసాగుతోంది.