

.పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వచ్చిన ఇటుక బట్టి కూలీలను, కనికరం లేకుండా కనీస కూలీ డబ్బులు చెల్లించకుండా, సమాజానికి చెప్పనీయకుండా నిర్బంధ ధోరణిలో వ్యవహరిస్తున్న యాజమాన్య చరలో మగ్గిపోతున్న 13 మంది ఇటుక కూలీలు షామీర్పేట పోలీసులను ఆశ్రయించడంతో, మూడుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్దమర్రి గ్రామ శివారులోని ఇటుక బట్టి వద్ద నిర్బంధ ధోరణిలో కూలిపని చేస్తున్న సదర్ 13 మంది కూలీలను యాజమాన్య చర నుండి విముక్తి కల్పించిన సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మూడు చింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామం శివారులో ఇటుక బట్టి నడుపుతున్న సదరు యజమాని తనకు కూలీలు కావాలని ఒరిస్సా కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తికి తెలిపాడు. దీంతో అతడు ఒరిస్సా కు చెందిన అంతర్ బుయాన్ ను కోరగా దీంతో అంతర్ బుయాన్13 మంది కూలీలను ఒరిస్సా నుంచి తీసుకువచ్చి ఉద్దమర్రి పరిధిలోని ఇటుక బట్టి నడుపుతున్న దీప్లాకు అప్పజెప్పాడు. ఇక అప్పటినుండి అక్కడే పని చేస్తున్న 13 మంది కూలీలకు ముందుగా మాట్లాడుకున్న మేరకు కూలి డబ్బులు చెల్లించకుండా, అరకొర కూలి మాత్రమే ఇస్తూ, కూలీ డబ్బులు మొత్తం ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాలుపడటమే కాకుండా, ఇతరులకు చెప్పకూడదంటూ హుకుం జారీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడంతో, సదరు ఇటుక బట్టి కూలీలు కొంతకాలం అరకొర కూలీలతోనే కాలం వెళ్ళీ తీసుకొచ్చారు. అయితే రోజురోజుకు వారి పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రాణాలకు తెగించి శామీర్పేట పోలీసులను ఆశ్రయించి జరిగింది విన్నవించారు. దీంతో రంగంలో దిగిన శామీర్పేట పోలీసులు, మూడు చింతలపల్లి మండల తహశీల్దార్ తో పాటుగా సిఐ సుధీర్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని ఇటుక బట్టి కూలీల దయనీయ పరిస్థితిపై వాస్తవాలను సేకరించి. 13 మంది కూలీలను ఇటుక బట్టి యాజమాన్య చర నుండి విముక్తి కల్పించారు. అక్రమాలకు పాల్పడుతున్న సదరు యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.