శామీర్‌పేట్ రైతులకు ఆధునిక వ్యవసాయ శిక్షణ….

Farmers Training in Shamirpet

శామీర్‌పేట్ మండలంలోని మూడు చింతలపల్లి రైతు వేదికలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ నిర్వహించగా, అధికారులు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు.
A training session on modern farming was conducted for farmers at the Rythu Vedika in Muthenchintalapalli under Shamirpet mandal, where officials emphasized that following agricultural guidelines can ensure higher yields.

శామీర్‌పేట్, మార్చి 24: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ తెలిపారు. మంగళవారం మూడు చింతలపల్లి మున్సిపాల్టీలోని రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారి ప్రవీణ్, ఉద్యాన శాఖ అధికారి వెంకటరమణ, వ్యవసాయ విస్తరణ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ శిక్షణలో పాల్గొని ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు.

Shamirpet, March 24: Farmers can achieve better yields by adopting modern agricultural practices and following the advice of officials, said Narsimlu Yadav. A training program was organized on Tuesday at the Rythu Vedika in Muthenchintalapalli under the ATMA initiative.

During the session, farmers were advised to strictly follow the recommendations of agriculture officials and embrace modern techniques. Vegetable seeds were distributed to farmers as part of the program. Agriculture Officer Praveen, Horticulture Officer Venkataramana, Agriculture Extension Officer Suresh, and farmers from various villages attended the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *