శామీర్ పేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

Babu Jagjivan Ram Jayanti Celebrations in Shamirpet

Babu Jagjivan Ram Jayanti was observed with tributes and public participation across Shamirpet and surrounding villages on Sunday, highlighting his contributions to social equality and welfare. శామీర్ పేట మరియు పరిసర గ్రామాల్లో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించి, ఆయన సేవలను స్మరించారు.

శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలో కూడా జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ అట్టడుగు వర్గంలో జన్మించి దేశంలో కీలక పదవులు చేపట్టిన నాయకుడిగా జగ్జీవన్ రామ్ ఎదిగారని గుర్తుచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

In multiple villages of Shamirpet mandal, floral tributes were paid to the statues and portraits of Babu Jagjivan Ram. Similar events were held in the Medchal-Malkajgiri district’s Moodu Chinthalapalli municipality. Speakers recalled his rise from humble beginnings to key national positions and praised his contributions towards the upliftment of marginalized communities, urging people to follow his ideals.

శామీర్ పేట మండల కేంద్రంలో కూడా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేడి రవి, డప్పు మురళీ, చిన్న బాబు, కొమ్ము యాదగిరి, మొరుగు శ్రీకాంత్, సాయి, సురేష్, విజయ్, గణేష్, జోయెల్, ప్రసాద్, కే శ్రీకాంత్, భాస్కర్, బి రవి తదితరులు పాల్గొన్నారు.

At Shamirpet mandal headquarters, locals gathered to pay respects and remembered his service to the nation. Several community members and youth participated in the event.

మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జామ్ రవి మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజ్ గౌడ్, దోసకాయల వెంకటేష్, బూరుగు రమేష్, పారుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

At Moodu Chinthalapalli municipality, local leaders emphasized his vision of social justice and equality, calling upon youth to take responsibility in building an inclusive society.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *