శామీర్ పేటలో సిపిఐ విమర్శలు…

CPI Slams Govt Over Public Issues

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నేతలు విమర్శించారు.
CPI leaders alleged that people are facing severe hardships due to the failures of central and state governments.

శామీర్ పేట, ఏప్రిల్ 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు డి.జి. సాయిల్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం శామీర్ పేట మండల కేంద్రంలో సిపిఐ శతజయంతి ఉత్సవాల అనంతరం ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా 2026 సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో భద్రతా పరిస్థితులు దిగజారడంతో పాటు యుద్ధ వాతావరణం, దాడులు పెరిగి ప్రజల సమస్యలు మరింత తీవ్రమయ్యాయని అన్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదల జీవన పరిస్థితులు క్షీణిస్తున్నా ప్రభుత్వాలు సమర్థంగా స్పందించలేకపోతున్నాయని విమర్శించారు.

పాలకులు కార్పొరేట్ శక్తుల ప్రభావానికి లోనై ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ పోరాటాన్ని మరింత బలపరుస్తుందని, ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుని ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఇందుకు ఆర్థిక సహకారం అవసరమని పేర్కొన్నారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పెరిగిందని అన్నారు. కార్మికులు, రైతులు, యువకులు, మహిళలు ముందుకు వచ్చి సిపిఐ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మండల కార్యదర్శి డి.జి. నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక భూ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపం, పెద్దమ్మ కాలనీ నీటి సమస్యలపై ఇప్పటికే కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన శామీర్ పేట గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారానికి ప్రజల మద్దతు అవసరమని, యువత, విద్యార్థులు సభ్యత్వంలో చేరాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సోగడ రమేష్, గొలుసుల మల్లయ్య, దొంతరమైన భూమయ్య, చీర్ల కౌసల్య, కలమ్మ, మనమ్మ, డి.జి. నాగరాణి, డి.జి. ధర్మ రక్షక్, డి.జి. నవీన, గడీల సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Shamirpet, April 4: CPI State Control Commission member D.G. Sailu Goud criticized that people are facing severe hardships due to the policies of the central and state governments. A membership renewal drive for 2026 was conducted on Friday at Shamirpet mandal headquarters as part of a door-to-door campaign following the CPI centenary celebrations.

He alleged that after the formation of the BJP government, security concerns, conflicts, and attacks have increased, worsening public issues. Rising prices, unemployment, farmers’ distress, and poor living conditions are intensifying while governments are failing to respond effectively.

He further stated that ruling authorities are neglecting public issues under corporate influence. CPI is preparing to intensify its struggles by reaching out to households, identifying problems, and organizing movements. Financial support is essential for these efforts, he added.

He criticized the governments for failing to control prices and said the increase in gas, petrol, and diesel rates has added financial burden on people. Workers, farmers, youth, and women were urged to support CPI initiatives.

Mandal secretary D.G. Narendra Prasad said protests and petitions were already submitted at the Collectorate regarding land disputes, lack of infrastructure, and water issues in Peddamma Colony. He appealed for public support to resolve issues in Shamirpet Gram Panchayat merged with Greater Hyderabad and encouraged youth and students to join the membership drive.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *