Jyotirao Phule Jayanti Celebrations in Shamirpet

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శామీర్పేటలో పలు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించగా, ప్రజలు, నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. On the occasion of Jyotirao Phule Jayanti, celebrations were held across Shamirpet with leaders and citizens paying floral tributes.
శామీర్పేట మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా పలు ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొని పూలే సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మహ్మద్ అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ సమాజంలో విద్యా వ్యాప్తికి జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం నెలకొనాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి నర్సింహా రెడ్డి, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, జూపల్లి వేణుగోపాల్, విజయ్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇదే సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా జయంతి వేడుకలు నిర్వహించారు. బీసీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చింతల రమేష్ గౌడ్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఝాన్సీరాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హకీంపేట డిపోలో కూడా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. డిపో అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొని ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సంఘ నాయకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
In Shamirpet mandal, Jyotirao Phule Jayanti was celebrated at multiple locations with people offering floral tributes to his portrait. The event organized under the leadership of Afzal Khan saw participation from local leaders and residents who remembered Phule’s contributions.
Speaking on the occasion, Mohammed Afzal Khan highlighted the immense efforts of Jyotirao Phule and his wife in spreading education and fighting social inequality. He stressed the need for building an equal society. Leaders including P. Narasimha Reddy, Mohammed Nisar Ahmed Khan, Jupalli Venugopal and others attended the event.
Similar celebrations were held at the district Collectorate, where BC Workers Union State President Dr. Chintala Ramesh Goud paid tributes. Officials including BC Welfare Officer Jhansi Rani also participated.
At Hakimpet Depot, employees organized Jayanti celebrations under the supervision of depot authorities. Staff members and union representatives remembered Phule’s contributions to social reform and education.