రంగారెడ్డి : ఎల్బీనగర్ లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేదు. సీపీ లోపలికి వెళ్ళేటప్పుడు తనిఖిలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ అని అడిగి మొబైల్ తీసుకుంది. డ్యూటీ సక్రమంగా చేసినందుకు సీపీ ఆమె 500 రూపాయలు రివార్డు ఇచ్చారు. ఉమెన్స్ కానిస్టేబుల్ డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా డ్యూటీ చేస్తున్న కల్పనను ప్రశంసించారు. సీపీ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున నుండి నియమ నిబంధనలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్ళేటప్పుడు గెట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఎస్ఎస్సి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్ కోసము, పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి లోపాలు, గొడవలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గట్టి బందోబస్తు చేస్తున్న మని తెలిపారు.