జగిత్యాల : పట్టణంలో గత కొన్ని రోజుల నుండి శబ్ద కాలుష్యంకు గురి చేస్తున్న వాహన యజమానులపై చర్యలు చేపట్టడం జరిగిందని జగిత్యాల ట్రాఫిక్ రాం తెలిపారు. జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు సిఐ రామచందర్ రావు ఆధ్వర్యంలో గురువారం శబ్ద కాలుష్యంపై కారణం అవుతున్న వాహనాలను పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. గడచిన నెల రోజులలో సౌండ్ పొల్యూషన్ శబ్ద కాలుష్యం చేసుకుంటూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించుచున్న 35 సౌండ్ పొల్యూషన్ బైకులను పట్టుకున్నట్లు వెల్లడిరచారు. శబ్ద కాలుష్యం వాహనాలకు సైలెన్సర్లను తీపించి, కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను బిగించి, జరిమానా విధించడం జరిగిందన్నారు. శబ్ద కాలుష్యం చేసుకుంటూ తిరిగే వాహనాలని పట్టుకుని సైలెన్సర్లు తీపించడమే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్సు చేయబడుతుందన్నారు.