Electricity Workers Move to Maha Dharna from Shamirpet Demanding Resolution of Issues

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శామీర్పేట సబ్ డివిజన్ పరిధిలోని కార్మికులు మహాధర్ణకు పెద్ద ఎత్తున తరలిపోయారు. Demanding resolution of their issues, electricity workers from the Shamirpet sub-division moved in large numbers to participate in a Maha Dharna.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట :విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు మహాధర్ణకు పెద్ద ఎత్తున తరలిపోయారు. మంగళవారం శామీర్పేట విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని అలియాబాద్ సెక్షన్, శామీర్పేట సెక్షన్లలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాధర్ణలో పాల్గొనేందుకు సమూహాలుగా బయలుదేరారు.
విద్యుత్ యాజమాన్యం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Electricity workers gathered in large numbers to participate in a Maha Dharna demanding that their long-pending issues be resolved. On Tuesday, workers from Aliabad and Shamirpet sections under the Shamirpet electricity sub-division performed special prayers at the Katta Maisamma temple in Shamirpet before leaving for the protest venue.
The workers warned that their agitation would continue until the electricity management addressed their demands and resolved their issues. A large number of workers from across the Shamirpet sub-division took part in the programme.