వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి లక్కీ డ్రా కేసుతో పాటు నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు.

. YSRCP leader and former minister Ambati Rambabu was released from Rajahmundry Central Jail after securing bail in three cases, including the Sankranti lucky draw case.

వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి లక్కీ డ్రా కేసుతో పాటు నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. YSRCP leader and former minister Ambati Rambabu was released from Rajahmundry Central Jail after securing bail in three cases, including the Sankranti lucky draw case.

రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నమోదైన మరో రెండు కేసుల్లో కూడా బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, తనను జైలులో పెడితే భయపడతానని భావించారని కానీ తాను వెనక్కి తగ్గబోనని తెలిపారు. తన అరెస్టు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్పై విమర్శలు చేశారు. తన ఇంటిపై దాడి జరిగిందని, కుటుంబ సభ్యులను వేధించారని, తనపై ప్రాణహానికీ ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎన్ని సార్లు జైలుకు పంపినా ప్రజా రాజకీయాల్లో వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.

అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో మొదట ముఖ్యమంత్రిని దూషించారనే ఆరోపణలపై అరెస్టు జరిగింది. అనంతరం పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే మరో కేసు నమోదైంది. 2023 సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరిట మోసం జరిగిందని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో మూడో కేసు నమోదు కాగా, తాజా బెయిల్‌తో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *