వైరల్ వయ్యారి సాంగ్ తో ‘జూనియర్’ మూవీకి బజ్ పెరుగుతుంది – కిరీటి రెడ్డి, శ్రీలీల జంట ఆకట్టుకోగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు హైలైట్

వైరల్ వయ్యారి సాంగ్ తో ‘జూనియర్’ మూవీకి బజ్ పెరుగుతుంది – కిరీటి రెడ్డి, శ్రీలీల జంట ఆకట్టుకోగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు హైలైట్

The recently released Viral Vayyari song from the upcoming film Junior has captured youth attention with its trendy beats, catchy visuals, and energetic performances by debutant Kireeti Reddy and actress Sreeleela. Directed by Radha Krishna and produced under the Varahi Chalana Chitram banner by Rajani Korrapati, this youthful entertainer is set to release on July 18.

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జూనియర్’ నుంచి విడుదలైన రెండో పాట ‘వైరల్ వయ్యారి’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి డెబ్యూ చేస్తున్న ఈ చిత్రంలో, హీరోయిన్ శ్రీలీల తన స్టైలిష్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.

దేవిశ్రీ ప్రసాద్ సాంగ్‌కు ఇచ్చిన మాస్ కంపోజిషన్ యూత్‌ను బాగా ఆకర్షిస్తోంది. పాటను DSP, హరిప్రియ కలిసి ఆలపించగా, కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ యువతకు కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా భాష, ట్రెండీ పదాలతో నింపబడ్డాయి. కిరీటి-శ్రీలీల కలసి చేసిన డాన్స్‌ విజువల్స్‌కు మరింత హైప్‌ తీసుకొచ్చాయి.

వైరల్ వయ్యారి పాట ఈ ఏడాది చార్ట్‌బస్టర్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ అందిస్తున్నారు. డైలాగ్స్‌ను కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని అందిస్తున్నారు. జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *