వైఎస్ షర్మిల ఇంటి వద్ద హైటెన్షన్… వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తన ఇంటి నుండి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో, షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చుండటంతో ఆగ్రహానికిలోనైన వైఎస్ షర్మిల.. కారుదిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసిస్తు కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. రోడ్డు మీద నుంచి లేమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దింతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతన్న తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. దీంతో కాసేపు షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.