వేసవి కాలమంటూ ఐస్క్రీమ్ కొంటున్నారా అయితే జాగ్రత్త అంటున్న పోలీసులు… సైబరాబాద్‌ లో భారీగా కల్తీ ఐస్‌ క్రీం తయారీ కేంద్రాలు…

హైదరాబాద్‌ లో కల్తీ ఐస్‌ క్రీం తయారీకేంద్రాలు గుట్టురట్టవుతోంది. చిన్నపిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్న కల్తీ ఐస్‌ క్రీం లపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం చందనగర్‌ లో 10 లక్షలు విలువ చేసే ఐస్‌ క్రీములు పట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి, పెట్‌ బషీర్‌ బాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కల్తీ ఐస్‌ క్రీమ్‌ తయారీ కేంద్రాలను గుర్తించారు. ఐస్‌ క్రీమ్‌ ల తయారీలో కల్తీ కలర్స్‌ ఉపయోగిస్తున్న సమాచారం తో కల్తీ ఐస్‌ క్రీమ్‌ తయారీ కేంద్రాలపై ఎస్‌ఓటి పోలీసులు వరుస దాడులు చేసారు. కల్తీ ఐస్‌ క్రీమ్‌ లకు బ్రాండెడ్‌ స్టిక్కర్లు జోడిరచి మార్కెట్లో అమ్ముతున్న వైనం. చందానగర్‌, కుకట్పల్లి, పెట్‌ బషీరాబాద్‌ ప్రాంతాల్లో కల్తీ ఐస్‌ క్రీమ్‌ తయారీ కేంద్రాలను గుర్తించారు.
ఎక్స్పైరీ డేట్‌ అయిపోయిన మెటీరియల్‌ ఉపయోగించి నిందితులు ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నారు. సైబరాబాద్‌ లో రెండు రోజుల వ్యవధిలో 28 లక్షల విలువచేసే కల్తీ ఐస్‌ క్రీములు స్వాధీనం చేసుకున్నారు.
అనూ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ పేరుతో నకిలీ ఐస్‌ క్రీమ్స్‌ తయారు చేస్తున్న గో డౌన్స్‌ పై బాలానగర్‌ ఎస్వోటీ పోలీసుల దాడి జరిగింది. కెమికల్స్‌, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ కలుపుతూ.. ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న 15 లక్షల విలువైన ఐస్‌ క్రీమ్‌ ప్రాడక్ట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ లో డైరీ కూల్‌ ఐస్‌ క్రీమ్స్‌ పేరుతో..నకిలీ ప్రాడక్ట్స్‌ తయారీ గోదాం పై దాడులు చేసారు. గొల్ల అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి 8 లక్షల 20 వేల విలువైన నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *