అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని పై అధికారులు ఆదేశించడంతో కొడుకు నిర్మిస్తున్నది తెలిసి కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన తల్లి. సదరు ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడలో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే .. ఫతుల్లాగూడ చేరువు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోని ఓ అక్రమ్ కట్టడం విలిసిందని, సదరు నిర్మాణం చేపట్టింది సదరు గ్రామ విఆర్ ఏ చంద్రకళ కుమారుడేనని తెలిసింది. దింతో సదరు అక్రమ నిర్మాణం పై స్థానికులు ఫోటోలు ఆధారాలతో సహా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసారు.
దింతో రంగంలోకి దిగిన అధికారులు… వాస్తవాలను పరిశీలించిన ఎమ్మార్వో గౌతమ్ కుమార్ అక్రమ నిర్మాణంమని తేలడంతో, అదే ప్రాంతానికి కావలదరుగా విధులు నిర్వహిస్తున్నతల్లి చంద్రకళ ను ఎమ్మార్వో ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొడుకు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని తల్లి చంద్రకళ కూల్చివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..