వివేకాలో కేసు తెరపైకి రెండో భార్య..



మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆయన రెండో భార్య షేక్‌ షవిూమ్‌పై చాలామంది ఫోకస్‌ పడిరది. అసలు ఆమె వెర్షన్‌ ఏంటి..? ఆమెతో వివేకా ఎలాంటి విషయాలు పంచుకునేవారు..? మర్డర్‌ గురించి ఎవరిపై ఆమెకు అనుమానాలు ఉన్నాయి వంటి విషయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా ఇచ్చిన స్టేట్మెంట్‌ సంచలనంగా మారింది. వివేకాతో 2010 లో వివాహం అయ్యిందని.. 2011లో మరోసారి వివాహం చేసుకున్నట్లు షవిూమ్‌ తెలిపారు. 2015లో తమకు షహన్షాన్‌ పుట్టినట్లు వివరించారు. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు షవిూమ్‌ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె తెలిపారు.వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షవిూమ్‌ వెల్లడిరచారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్‌ రెడ్డికి కాంక్ష ఉండేదన్నారు. తమ కొడుకు షహన్షాన్‌ పేరు విూద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్‌ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్‌ పవర్‌ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్‌ పవర్‌ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షవిూమ్‌ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్‌ సెటిల్మెంట్‌ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్‌ రెడ్డి విూద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షవిూమ్‌ వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *