ప్రధాని నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హావిూలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నామని ఆ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు ‘కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం అని బీజేపీ ఖ లీడర్లు బుకాయిస్తున్నారు కానీ ఎంక్వైరీ చేయడం లేదు. మా పార్టీ కాళేశ్వరం అవినీతిపై ఢల్లీికి వెళ్లి పోరాటం చేసింది. కాగ్, సిబిఐ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలులేవు. విూ రాజకీయస్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము దొర గారికి లేదు. చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం కేసీఆర్ కి అలవాటుగా మారింది. దొర గారి రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని ఆమె అన్నారు.